టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానంపై ఈఓ సంచలన ప్రకటన

by Rani Yarlagadda |   ( Updated:2024-10-05 06:11:11.0  )
టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానంపై ఈఓ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానంపై ఈఓ శ్యామలరావు సంచలన ప్రకటన చేశారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీలో గత ఐదేళ్లుగా అమలవుతోన్న రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తున్నట్లు శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమలలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ముగిసిన వెంటనే ఈఓ శ్యామలారావు ఈ ప్రకటన చేశారు.

గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రకటించింది. 2019లో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన జీఓ 67ను రద్దు చేస్తూ సెప్టెంబర్ 16న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి.. పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు టీటీడీకూడా అదే విధానాన్ని అనుసరిస్తూ చర్యలు చేపట్టింది.

Advertisement

Next Story