- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొమురవెల్లి మల్లన్నకు శఠగోపం..
దిశ, సిద్ధిపేట ప్రతినిధి/కొమురవెల్లి : కోరిన కోరికలు తీర్చే కొమురవెల్లి మల్లన్నకే దేవాలయ అధికారుల శఠగోపం పెట్టారు. మల్లన్న ఆలయ దేవాలయ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2018లో నిర్వహించిన ఆడిట్ లో 54 అంశాలు రూ.3కోట్లకు పైగా లావాదేవీలపై అభ్యంతరాలు వ్యక్తమవగా.. అప్పటి వరకు విధులు నిర్వహించిన ఐదుగురు ఈవోలకు, 11 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆలయ ఈవో త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫైల్స్ క్లియర్ చేసే పనిలో ఉండగా గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన సదరు ఫైల్స్ మాయమవడం కలకలం రేపుతోంది. మల్లన్న దేవాలయానికి సంబంధించి ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2017 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సూమారు ఐదున్నరేళ్ల క్రితం ఆడిటర్ లక్ష్మీ నారాయణ సారథ్యంలో ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు 54 అంశాల్లో సుమారు రూ.3కోట్ల పైగా లావాదేవీలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంబీ రికార్డులు లేని మరమ్మతులు రూ.70.19 లక్షలు, అనుమతి లేని ప్రహారీ నిర్మాణానికి రూ.20.91 లక్షలు, ఒరిజినల్ బిల్లులు లేని ఉద్యోగుల అడ్వాన్సులు రూ.14.84 లక్షలు, అతిథుల భోజనాల ఖర్చులు రూ.5.34 లక్షలు, వాహనాల అద్దె రూ.4.56 లక్షలు, దుస్తుల రూ.13.96 లక్షలు, మొక్కల పెంపకం రూ.3.63 లక్షలు, వేలం పాట బకాయిలు రూ.22.29 లక్షలు, ఆలయ సిబ్బంది బ్యాంకుల్లో చెక్కుల ద్వారా విడుదల చేసిన రూ.33.26 లక్షలతో పాటుగా ఇతర ఖర్చులపై అభ్యంతరాలు వ్యక్తం కాగా సదరు మూడెళ్ల ల్లో ఆలయంలో విధులు నిర్వహించిన ఐదుగురు ఈవోలు, ఆయా విభాగాల్లో పనిచేసిన 11 మంది ఉద్యోగులకు నాటి దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అప్పటి అధికారులు ఎంబీ రికార్డులు, బిల్లులు అందజేయగా సుమారు రూ.1 కోటికి పైగా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినప్పటికి సదరు డబ్బులు విషయంలో ఇప్పటి వరకు అధికారులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
లెక్కల పైల్స్ మాయం..
మల్లన్న దేవాలయ నాలుగేళ్లుగా ఇన్చార్జి ఈవోగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ డిసెంబర్ లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆలయంలో పలు పైల్స్ మాయం అయినట్లు గుర్తించారు. ఈ మేరకు గతంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో విధులు నిర్వహించిన నీల శేఖర్, వైరాగ్యం జగన్, మిన్నల పురం నర్సింహులుకు అడిట్ అభ్యంతరాల ఫైళ్లు మాయం అవడంపై నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు కొండగట్టు, వరంగల్ భద్రకాళి, మేడారం ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో పైల్స్ మాయం అంశం మరో మారు తెర మీదకు రావడం తో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏం చర్యలు చేపడతారో చూడాలి మరి.