- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీ కేర్ ఫుల్.. ఆగని నకిలీ వైద్యం దందా
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నగరంలో నకిలీ వైద్యులు కలకలం సృష్టిస్తున్నారు. అర్హత లేకున్నా నాసిరకం వైద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిలో నకిలీ డాక్టర్లు చేరుతున్నారు. చీమల పుట్టలో పాములు చేరినట్లు వైద్య వృత్తిలో నకిలీలు చేరి ప్రాణాంతకంగా మారుతున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ వైద్య పట్టాలు కొనుగోలు చేసి డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
తమకు తెలిసిన అరకొర వైద్యంతో రోగుల ప్రాణాలతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా వైద్యం పేరుతో అడ్డగోలుగా రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మెడికల్ ఫీల్డ్ లో కొన్నేళ్లపాటు అనుభవం సంపాదించిన కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు సొంతంగా క్లినిక్ లు స్టార్ట్ చేస్తున్నారు. వీరిలో కొందరు వైద్యం వృత్తిలో బాగా అనుభవం ఉండి క్రిటికల్ కేసులను సైతం డీల్ చేయగలిగే నైపుణ్యం ఉన్న వారు బీడీఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి డాక్టర్ పట్టాలు అడ్డదారిలో భారీగా సంపాదించుకోవడానికి నర్సింగ్ హోం లెవెల్ లో హాస్పిటల్ నడుపుతున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే నకిలీ వైద్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 8 వేలకు పైగా ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వైద్యం చేస్తున్నారు. వీరిలో చాలామందికి సరైన విద్యార్హతలు కూడా లేకపోవడం గమనార్హం. కనీస డిగ్రీ కూడా లేకుండా ఆర్ఎంపీ, పీఎంపీలుగా కొనసాగుతున్న వారు దాదాపు 4వేల వరకు ఉన్నట్లు అనధికారిక రికార్డులను బట్టి తెలుస్తోంది. యూనివర్శిటీల్లో వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ పట్టాను సంపాదించు కున్నట్లుగా మార్కెట్ లోచారం చేసుకుంటూ క్లినిక్ లు నడుపుతున్నారు. ఫైల్స్, సుఖవ్యాధులు, ఎగ్జిమా, చర్మ సంబంధిత వ్యాధులతో పాటు ప్రభుత్వం నిషేధించిన అబార్షన్ కేసులు కూడా తాము సేఫ్ గా రహస్యంగా చేస్తామని, పేషెంట్ల వివరాలు బయటకు చెప్పకుండా గోప్యాన్ని పాటిస్తామని ప్రచారం చేసుకుంటూ రోగులను ఆకర్షిస్తున్నారు.
ఇలాంటి చాలా మంది నకిలీ డాక్టర్లు దర్జాగా నడుపుతున్న క్లీనిక్ లు ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా ఉన్నాయని ఇటీవల ఇలాంటి క్లీనిక్ లపై రైడ్ చేసిన అధికారులు తెలిపారు. వైద్య వృత్తిలో అనుభవమున్న కొందరు ఇలాంటి నకిలీ పట్టాలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్లినిక్ లు ఓపెన్ చేసి డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. నకిలీ డాక్టర్లు వారికున్న వాక్చాతుర్యం, ఆహార్యంతో అసలైన డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు, బోర్డులు పెట్టి క్లినిక్ లు స్టార్ట్ చేసి వైద్యం చేస్తున్నారు. భారీగా పెట్టుబడి పెట్టి అవసరమైన ఎక్విప్ మెంట్ కొనుగోలు చేసి, మెడికల్ ల్యాబ్ లు, మెడికల్ షాపులు, ఇతర అటాచ్డ్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసుకుని ఓ ఫుల్ ప్లెడ్జ్ హాస్పిటల్ ను సెటప్ చేసుకుంటున్నారు. తాము నకిలీ డాక్టర్లమనే భయం వారిలో మచ్చుకైనా కనిపించకుండా మేనేజ్ చేస్తూ నిర్భీతిగా వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.
తెలంగాణ వైద్య మండలి బృందం దాడులతో బయటపడ్డ నకిలీ డాక్టర్ ల బాగోతం..
తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని యాంటీ క్వేకరీ బృందం మూడు రోజుల క్రితం జరిపిన ఆకస్మిక దాడులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న నకిలీ డాక్టర్ల వైద్య దందా భాగోతం బయట పడింది. నిజామాబాద్ నగరంతోపాటు బాన్సువాడ, ఆర్మూర్ పట్టణాల్లో కూడా సుమారు 50 క్లీనిక్ లపైన ఆకస్మిక రైడ్ లు నిర్వహించి 15 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేసింది. తమ దాడులతో భయపడి చాలా మంది నకిలీ డాక్టర్ లు క్లీనిక్ లు మూసేసుకున్నారని, మరోసారి కూడా రైడ్స్ నిర్వహిస్తామని అధికారులు చెపుతున్నారు. ఈ రైడ్స్ జరిగే వరకు ఉమ్మడిజిల్లా వైద్య ఆరోగ్యశాఖలు సైతం ఈ నకిలీ డాక్టర్ ల భాగోతాన్ని పసిగట్టకపోవడం గమనార్హం. నిజంగానే ఆ శాఖ అధికారులకు తమ పరిధిలో నకిలీ డాక్టర్లు వైద్య దందా చేస్తున్నారనే సమాచారం లేక యాక్షన్ తీసుకోలేదా? లేదంటే ధనంమూలం ఇదమ్ జగత్ అనే సూక్తికి ఆకర్షితులై నకిలీలతో కుమ్మక్కై వారి ఆటలను అనధికారికంగా పర్మీషన్లు ఇచ్చారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ తీరు ఎలా ఉన్నప్పటికీ అసలైన డాక్టర్లు, ఐఎంఏ లకు కూడా నిజంగా ఈ నకిలీ డాక్టర్ల బాగోతం తెలియలేదా? లేదంటే తమకెందుకులే అని మిన్నకుండిపోయారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలా మిగిలిపోయింది.
అడ్డగోలుగా యాంటి బయోటిక్స్ వాడకం..
హాస్పిటల్స్ కు వచ్చిన పేషంట్లకు ఈ నకిలీ డాక్టర్లు అడ్డగోలుగా యాంటీబయోటిక్ డ్రగ్స్ ఇస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని తనిఖీలు చేపట్టిన అధికారులు వెల్లడించడం గమనార్హం. పేషంట్లకు ప్రతి చిన్న రోగానికి యాంటి బయోటిక్ డ్రగ్స్ కు అలవాటు చేయడం వలన భవిష్కత్తులో యాంటి బయోటిక్ డ్రగ్ కూడా పని చేయకుండా పోతుందని వారన్నారు. చిన్నపాటి జ్వరంతో వచ్చినా ఇన్ పేషంట్ గా చేర్చుకుని పేషంట్ కు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం కూడా తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ట్రీట్మెంట్ పేషంట్ల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయని వారన్నారు.
చట్టం అంటే భయం లేకుండా నిర్భీతిగా అబార్షన్లు..
కొందరు మహిళలు అక్రమ సంబంధాలు, బాయ్ ఫ్రెండ్స్ వలలో పడి ప్రెగ్నెంట్ గా మారిన టీనేజ్ అమ్మాయిలకు అబార్షన్ చేస్తూ లక్షలు సంపాదించే ఈ నకిలీలను కొందరు ఏజెంట్ల ద్వారా బాధితులు వీరిని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సందర్భాలను నకిలీ డాక్టర్లు భారీగా దండుకునేందుకు దొరికిన అవకాశంగా మలుచుకుంటున్నారు. అబార్షన్ సమయంలో పేషెంట్ పరిస్థితి ఉన్నట్టుండి క్రిటికల్ మారితే పేషంట్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ, ఇలాంటివేవీ చేసుకోకుండానే హడావిడిగా అబార్షన్ లు చేస్తున్నారు. ఒక్కసారి ఈ ప్రయత్నాలు బెడిసి కొట్టి పేషంట్ల పరిస్థితి విషమిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు పేషంట్లను వారి బంధువులు కార్పొరేట్ హాస్పిటల్స్ కు పేషంట్ ను ఉన్నఫలంగా తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు ఆర్ఎంపీలు చేసిన అబార్షన్ లు వికటించి నలుగురైదుగురు మహిళలకు గర్భసంచి తొలగించిన దాఖలాలు కూడా ఉన్నాయి. చేసుకున్నాయి.ఈ కేసుల్లో ఆర్ఎంపీల నుంచి లక్షల్లో నష్టపరిహారం వసూలు చేసి కేసును మాఫీ చేసుకున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి