- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ తెచ్చుకున్నది ప్రజల సొమ్ము దోచుకోవడానికేనా: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
దిశ, హన్మకొండ: తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని ఇతర రాజకీయ పార్టీలకు పెట్టుబడిగా పెట్టడం కోసమేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. వరంగల్ పోలీసుల విచారణకు హాజరై తిరుగు ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సకాలంలో ఫించన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవని, కానీ ఆయన ఖజానా మాత్రం నిండుగా ఉందన్నారు. దేశంలోనే రీచెస్ట్ ముఖ్యమంత్రి, రీచెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ముద్ర పడుతుందన్నారు. అసైన్డ్ భూములు గుంజుకొని అక్రమ దందాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి తన సెల్ ఫోన్ కు వాట్సప్ కాల్ వచ్చినట్టుగా ఎవరైతే చెప్పారో అది నిజం కాదని కొట్టి పారేశారు. పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలు ఆడుతుందని ఆరోపించారు. ఇవన్నీ చర్చ జరుగకుండా తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడంలో భాగంగానే బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మొక్కవోని ధైర్యంతో మరింత అంకుటిత దీక్షతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంత వరకు ప్రజల ఆశయాన్ని నెరవేర్చేంత వరకు ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.
Also Read..
ప్రభుత్వ భూమిలో BRS MP పాగా.. భూ దోపిడీలను సీరియల్‌గా ప్రకటిస్తా: రేవంత్ రెడ్డి