- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీఎంఈ ఇష్యూ ఏం చేద్దాం.. సతమతం అవుతున్న సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టు లో ఇంచార్జీ పై కోర్టు స్టే విధించడం, గవర్నర్ ఏజ్ లిమిట్ బిల్లు తిరస్కరణ తర్వాత ఏం చేద్దామని? సర్కార్ ఆలోచిస్తున్నది. ప్రస్తుత డీఎంఈని మార్చాలా? కొనసాగించాలా? అని వివిధ రకాల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. ఇంచార్జీ పోస్టు ను రద్దు చేయాలని కోర్టు స్టే ఇవ్వడం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని అడ్మినిస్ట్రేషన్ హెచ్‌వోడీల పోస్టు ఏజ్‌ను 61 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచిన బిల్లుకు గవర్నర్ నో చెప్పడంతో ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నది.
అవసరమైతే స్టే వెకెట్ ఫిటిషన్ను కూడా వేయాలని భావిస్తున్నట్లు సెక్రటేరియట్ లోని ఓ అధికారి ఆఫ్‌ది రికార్డులో తెలిపారు.ఇది వర్కవుట్ కాకపోతే కొత్తగా తెరమీదకు సెలక్షన్‌కమిటీ లిస్టు అనే విధానాన్ని తీసుకురావాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఏజ్‌లో సీనియరిటీ లేకున్నా.. అడ్మినిష్ట్రేషన్లోని అనుభవం ఉన్నోళ్ల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఒకరిని ఎంపిక చేసి డీఎంఈ సీట్లో కూర్చోపెట్టాలని ప్లాన్చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ఇది రూల్స్‌కు విరుద్ధమని డాక్టర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క వ్యక్తి కోసం ప్రభుత్వానికి ఎందుకు అంత ప్రేమ అంటూ ఫైర్ అవుతున్నారు. దీని వలన ఎంతో మంది సీనియర్లు నష్టపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికల వరకు ప్రస్తుత హెచ్వోడీలెవ్వరినీ మార్చే ఆసక్తిలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోన్నది.