Dating app fraud : ఆ ‘హాయ్’ వెనుక ఏ హాని దాగుందో? అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: పోలీస్

by Ramesh N |   ( Updated:2024-08-25 15:12:01.0  )
Dating app fraud : ఆ ‘హాయ్’ వెనుక ఏ హాని దాగుందో? అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: పోలీస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అమయకులే టార్గెట్‌గా అమ్మాయిలతో వల వేసి కొంత మంది కేటుగాల్లు డబ్బులు గుంజుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్‌లు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆ ‘హాయ్’ వెనుక ఏ హాని దాగుందో? అని డేటింగ్ యాప్స్ వాడకంపై అవగాహన కల్పించారు. డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలకు వలపు వల విసిరి నేరుగా కలుద్దామని ఒప్పించి ముందుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్న క్లబ్/పబ్బుకి తీసుకెళ్తారని తెలిపారు. వేలల్లో బిల్లు వచ్చేలా చేసి మోసం చేసే తప్పనిసరిగా కట్టేలా ఇరికించి మళ్లీ కనిపించకుండా మొహం చాటేసి మోసం చేసే కనెక్షన్లు ఉంటాయి. ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు.

క్లబ్/పబ్బుకి తీసుకెళ్లి వేలల్లో బిల్లు వచ్చేలా చేసి మోసం చేసే అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓ వ్యక్తికి వచ్చిన రూ. 48,996 బిల్లును పోస్ట్ చేశారు. కాగా, ఇటీవల డేటింగ్ యాప్ మాయలో పడి వైజాగ్ టెకీ రూ.28 లక్షలు పొగొట్టుకున్నాడు. దీంతో అను సైబర్ పోలీసుల్ని ఆశ్రయిస్తే మోసగాళ్లు హైదరాబాద్ కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నట్లు విశాఖ సైబర్ పోలీసులు గుర్తించారు. విశాఖకు చెందిన కృష్ణ మనోజ్ ఇంజనీర్‌ను సాయి ధీరజ్, లోకేష్, శాలిని అనే ముఠా మోసం చేసినట్లు విశాఖ సైబర్ పోలీసులు గుర్తించారు. మరోవైపు దినేష్ అనే సాఫ్ట్‌వేర్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న సాయి ప్రియ అనే మహిళ.. అతని వద్ద నుంచి రూ.21 లక్షలు కాజేసినట్టు కాజేసినట్టు సైబర్ పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed