శభాష్.. సాయిచరణ్! నీ సాహసం యువకులకు స్పూర్తి! బాలుడిని సన్మానించిన సీఎం

by Ramesh N |   ( Updated:2024-04-28 14:18:10.0  )
శభాష్.. సాయిచరణ్! నీ సాహసం యువకులకు స్పూర్తి! బాలుడిని సన్మానించిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: షాద్‌నగర్ నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు. ఈ బాలుడి సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఈ క్రమంలోనే ఇవాళ బాలుడి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కలిశారు. ఈ కమ్రంలోనే ముఖ్యమంత్రి బాలుడిని సన్మానించారు.

కాగా, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ నెల 26న నందిగామలో స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుండడంతో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే సాయిచరణ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ నాలుగో అంతస్తులో చిక్కుకున్న కొందరిని రక్షించాడు. అతడు చూపిన ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ రూ. 5 వేలు రివార్డుగా ఇవ్వగా.. తీసుకోవడానికి బాలుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్నవారంత సాయిచరణ్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు.

Read More...

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు.. రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కౌంటర్

Advertisement

Next Story

Most Viewed