- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణిని ప్రైవేట్‌పరం కానిచ్చే ప్రసక్తే లేదు: మంత్రి KTR
దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కానీచ్చే ప్రసక్తే లేదని, కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఉద్దేశపూర్వకంగానే సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆరోపించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో మొదలుపెట్టిన ప్రక్రియ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ కుట్రలకు ఎదురొడ్డి నిలుస్తుందన్నారు. సింగరేణి కార్మికులను, ఉద్యోగులను కలుపుకుని ఉద్యమం చేసి మరీ సంస్థను రక్షించుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం తన అస్మదీయులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నదన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో గుజరాత్ పట్ల ప్రేమ కురిపిస్తున్న కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.
విభజన చట్టం విషయంలో ఇచ్చిన హామీలను సైతం కేంద్రం అమలుచేయడంలేదని, ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో కేంద్రం మాట తప్పిందన్నారు. ఇక్కడ లభిస్తున్న ముడి ఇనుములో నాణ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తన్నదని మండిపడ్డారు. ఇకపైన కూడా కేంద్రం అదే వైఖరితో ఉంటే ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధం కాకపోతే సింగరేణి సహకారంతో లేదా ప్రైవేటురంగానికి చెందిన సంస్థల ద్వారా పరిశ్రమను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందని క్లారిటీ ఇచ్చారు. కానీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావడం మాత్రం తథ్యమన్నారు.