Farmers : వ్యవసాయ చరిత్రను తిరగరాస్తాం.. రుణమాఫీపై సీఎం రేవంత్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
Farmers : వ్యవసాయ చరిత్రను తిరగరాస్తాం.. రుణమాఫీపై సీఎం రేవంత్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణలో రైతులు ప్రజా ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధీమాతో హలాలు భుజాన వేసుకుని పొలాల్లో కదం తొక్కాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రతి రైతు మోములో ఆనందం ఉండాలని పేర్కొన్నారు.

‘నాగలిని రైతు భుజాన మోస్తే కోట్లాది మంది ఆకలి తీరుతుంది. అప్పుతీరి రైతు ఊపిరి పీల్చుకుంటే పొలంలో పైరు ఊపిరిపోసుకుంటుంది. రైతుబిడ్డగా ఆ కష్టం తెలిసిన వాడిగా రుణమాఫీ పై సాహసోపేత నిర్ణయం తీసుకున్నాను. సోనియమ్మ అండ రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యం కలగలసిన సంకల్పం ఇది. జూలై 18 నాడు రూ.లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేశాం. అదే పట్టుదలతో ఈ శుభదినాన రాష్ట్ర వ్యాప్తంగా రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఆగస్టు లోపు రూ.2 లక్షల వరకు ఉన్న ప్రతీ రైతు రుణం మాఫీ చేసి వ్యవసాయ చరిత్రను తిరగరాస్తామం’ అని సీఎం క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed