- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చంపేట గొడవ పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్
దిశ, డైనమిక్ బ్యూరో: అచ్చంపేట గొడవ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి స్పష్టం చేశారు. అచ్చంపేట లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరాచక శక్తిగా తయారయ్యాడని విమర్శిస్తూ ఇవాళ ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో డబ్బుల సంచులతో రాజకీయాలు చేస్తున్నాడని, నిన్న గువ్వల బాలరాజు ఒక కారులో డబ్బుల సంచులతో పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. దాన్ని ఆసరా చేసుకొని గువ్వల బాలరాజు అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేశారని, తిరిగి కాంగ్రెస్ వాళ్లే దాడులు చేశారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. గువ్వల బాలరాజు తనకు దెబ్బలు తగిలాయని నాటకాలు ఆడుతూ సానుభూతి కోసం ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. పోలీసులు కూడా ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.