శాంతి భద్రతలు కాపాడటమే పోలీసుల లక్ష్యం : రామగుండం సీపీ

by Aamani |
శాంతి భద్రతలు కాపాడటమే పోలీసుల లక్ష్యం :  రామగుండం సీపీ
X

దిశ, కన్నెపల్లి : గ్రామాల్లో శాంతి, భద్రతలను కాపాడటం పోలీసుల ముఖ్య లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆయన మండలంలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ లో పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుల గురించి ఆరా తీశారు. అనంతరం గ్రామాల్లో శాంతిభద్రతల గురించి పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మావోయిస్టుల వివరాలు తెలిపే పోస్టర్లను పరిశీలించి వారి సమాచారం గురించి ఆరా తీశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఎన్ఐబి ఇన్స్పెక్టర్ కరుణాకర్ కన్నెపల్లి ఎస్సై గంగారం పోలీసు సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed