శంషాబాద్‌లో హైడ్రా బృందం పర్యటన..

by Aamani |
శంషాబాద్‌లో హైడ్రా బృందం పర్యటన..
X

దిశ,శంషాబాద్ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 108,109 లలో ఉన్న రెండున్నర ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు రావడంతో గురువారం శంషాబాద్ తహసిల్దార్ రవీందర్ దత్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావులతో కలిసి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించి, కోట్ల విలువ వేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే మీరు ఏం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తొండుపల్లి చెరువు వద్ద ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు రావడంతో ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టి పరిశీలించడం జరిగిందన్నారు ఈ పరిశోధనలు 109 సర్వేనెంబర్ లో ఉన్న రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో మట్టి పోసి దంపించేసి రోడ్డు వేసి కబ్జా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పక్కనే ఉన్న వెంచర్ నిర్వాహకులు ఈ ప్రభుత్వ భూమిని పార్క్ స్థలంగా లేఅవుట్లో చూపించారని తేలేదని వెంచర్ నిర్వాహకులపై స్థానిక పోలీస్ స్టేషన్లో హైడ్రా ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు.

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా శాటిలైట్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పక్కనే ప్రభుత్వ స్మశాన వాటిక 108 సర్వే నెంబర్ లో కూడా అక్రమంగా హోల్డింగ్స్ ఏర్పాటు చేశారని తమ దృష్టికి వచ్చిందని వాటిని వెంబడి తొలగించడం జరుగుతుందన్నారు. చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించి విక్రయించిన కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సీఐ తిరుమలేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed