- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Amit Shah: అమిత్ షాపై కాంగ్రెస్ సభాహక్కుల నోటీసులు తిరస్కరించిన జగ్‌దీప్ ధన్‌ఖర్

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సహాయనిధిలో ఆ పార్టీ అధ్యక్షుడు సభ్యుడుగా ఉండేవారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ బుధవారం రాజ్యసభకు సభాహక్కుల నోటీసులిచ్చింది. దీన్ని గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తిరస్కరించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆమెకు ఆరోపణల్ని ఆపాదించారు. సోనియాగాంధీపై దుష్ప్రచారం చేసినందుకు అమిత్ షాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ నోటీసులు జారీ చేశారు. మార్చి 25న రాజ్యసభలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బిల్లు, 2024పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రామాణీకమని చూపారంటూ ధన్‌ఖర్ చెప్పారు. 1998, జనవరి 24న భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన పత్రిక ప్రకటనను అమిత్ షా ఉదహరించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడూ, ఇతర వ్యక్తులతో కూడిన కమిటీ నిర్వహించారన్నారు. హోంమంత్రి ప్రకటన అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఎటువంటి ఉల్లంఘన జరగలేదని కనుగొన్నట్టు చెప్పిన జగ్‌దీప్ ధన్‌ఖర్, ఉల్లంఘన నోటీసును తిరస్కరించారు.