MLC Kavitha : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకై పోరాటం చేస్తాం : ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |
MLC Kavitha : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకై పోరాటం చేస్తాం : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy BC Declaration) అమలుకై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ, విశ్వకర్మ కుల సంఘాల(Mudiraj and Vishwakarma caste associations)నాయకులతో కవిత తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కులగణన సమగ్ర కుటుంబ సర్వేతో హడావుడి చేసిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వే మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అయితే కాంగ్రెస్ వాగ్ధానం చేసిన 42% బీసీ రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమన్నారు.

బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అమలు చేసిన బీసీల సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కుల వృత్తులకు అందించిన సబ్సిడీ పథకాలను, బీసీ బంధును కాంగ్రెస్ పక్కన పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో బీసీ సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ ల హక్కుల పరిరక్షణకు, బీసీల హక్కుల సాధనకు తాను, బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతామన్నారు. బీసీల హక్కుల సాధనకు తెలంగాణ జాగృతి చేపట్టిన కార్యక్రమాలను కవిత గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed