- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోండని, జ్యూడిషియల్ విచారణను స్వాగతిస్తున్నామని, తప్పు చేస్తే శిక్ష తప్పదని మాజీ మంత్రియ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, వాటికి నిర్మాణ సంస్థే బాధ్యత వహింస్తుందని అన్నారు. పదే పదే ఆరోపణలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిందని, సాగు నీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతులకు నీరందించడానికి గత పాలకుల ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పితామహుడు కేసీఆర్ అని కొనియాడారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టి 30 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, మరో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు నీరు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. బేషజాలకు కాంగ్రెస్ పోవడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత పదేళ్లలో కరువు లేదన్నారు. రెండు పంటలు పుష్కలంగా పండాయని గుర్తు చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో గత కొన్నేళ్లుగా ఏటా రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు. కొండపోచమ్మ సాగర్, సింగూర్ ప్రాజెక్టు, నిజాం సాగర్, శ్రీరాంసాగర్, మల్లన్న సాగర్‌లో నీటిని దాచి పెట్టుకుంటే లాభం ఉండదని తెలిపారు. నీటిని విడుదల నిర్ణయం తీసుకోకుండా, నీళ్లు వదిలి పెట్టకుండా భూములను పడావు పెట్టారని దీంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల మీద మీకు ఎందుకు కోపం ఎందుకు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో 27 నుంచి 30 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, వీటితో 2.5 నుంచి 3 లక్షల ఎకరాల వరకు సాగు నీరు ఇవ్వొచ్చని అన్నారు. వెంటనే ప్రభుత్వం నీరు విడుదల చేసి భూములు సాగులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్‌లో అందుబాటులో ఉన్న నీటిని వదిలిపెట్టి మనకు 1,300 కి.మీ దూరంలోని కోయనా డ్యాం నుంచి నీటిని తీసుకువస్తామని చెబుతున్నారని అన్నారు. అక్కడి నుంచి 30 టీఎంసీల నీరు వదిలితే ఇక్కడకు 3 టీఎంసీలు కూడా చేరవని, ఇది అనాలోచితమైన చర్య అని పోచారం అన్నారు. అవగాహన లోపంతో, అనాలోచిత చర్యలతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు.