పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నాం : మంత్రి ఎర్రబెల్లి

by Nagaya |   ( Updated:2022-12-16 09:33:52.0  )
పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నాం : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ ఆర్మూర్: పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి.. ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి జడ్జి షాలినినీ కలిశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనడానికి నిదర్శనం ఇదేననని అన్నారు. నార్మల్ డెలివరీలు చేయడానికి వైద్యులు కృషి చేయాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story