దంచికొట్టిన భారీ వర్షం.. తెలంగాణలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

by Mahesh |   ( Updated:2024-09-01 03:17:19.0  )
దంచికొట్టిన భారీ వర్షం.. తెలంగాణలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లు వుండటంతో ఎటు చేసిన వరద నీరు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మహబుబాబాద్ జిల్లాలోని తాళ్ళపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా వచ్చిన వరద కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఇది గమనించిన సిబ్బంది రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో నడిచే అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం ట్రాక్ మరామత్తు పనులను చేపట్టారు. కాగా వరద ఉధృతి కారణంగా దాదాపు 50 మీటర్ల పొడవు మేర.. రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టితో పాటు కట్ట కొట్టుకు పోయింది. దీంతో రైలు పట్టాలు గాలిలో వేలాడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed