- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2.78 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం…
దిశ, హైదరాబాద్ బ్యూరో: ఎక్సైజ్ పోలీసుల దాడులలో 79 కేసులలో పట్టుబడిన సుమారు రూ. 2. 78 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ ను సోమవారం అధికారులు దహనం చేశారు. హైదరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్ కేఏబి శాస్త్రి ( Chairman of the Drug Disposal కమిటీ) అదేశాల మేరకు ఏఈఎస్ సికింద్రాబాద్ శ్రీనివాసరావు అధ్వర్యంలో వీటిని కాల్చివేసినట్లు అధికారులు తెలిపారు. హైరదాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో వీటిని అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఇందులో అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 కేసులు, చార్మినార్ స్టేషన్‌లో 13 కేసులు, గోల్కండ స్టేషన్‌లో 39 కేసులతో కలుపుకుని మొత్తం 79 కేసుల్లో 135.8 కేజీల గంజాయి, 174.8 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను, 1939.5 కేజీల పాపిష్ట , 2.1 గ్రాముల హషీష్ అయిల్ , 300.6 గ్రాముల చరస్, 5.14గ్రాముల కోకైన్, 25 ఎల్‌ఎస్‌డి బాస్ట్‌లు, 9.8 కిలో అల్పోజోలం, 14 గ్రాముల ఎస్టోస్టి పీల్స్ పట్టుబడగా జీజే మల్టీ కౌవ్ ఇండియా లోని దహన సెంటర్‌లో వీటిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మూడు పోలీస్ స్టేషన్ల సీఐలు, సిబ్బందిని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ కేఏబి శాస్త్రీ, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి అభినందించారు.