KTR: వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. ఆర్థికసాయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-28 12:23:06.0  )
KTR: వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. ఆర్థికసాయం
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa) కూల్చివేతల కారణంగా ఇంటితో తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ(Vedashree) కుటుంబాన్ని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోమవారం పరామర్శించారు. వేదశ్రీతో మాట్లాడి ఇళ్లు కూల్చివేసిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు కోల్పోయిన వేదశ్రీ(Vedashree)కి పుస్తకాలతో పాటు బ్యాగులను అందించారు. వారి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. హైడ్రా(Hydraa) కూల్చివేతల కారణంగా మా పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని వేదశ్రీ కుటుంబసభ్యులు కేటీఆర్‌(KTR) ఎదుట ఆవేదన చెందారు.

అనుమతులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రేవంత్ సర్కార్(CM Revanth Reddy) పేదల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సడెన్‌గా వచ్చి పేదల ఇండ్లను అప్పటికప్పుడు కూల్చివేయటమనేది చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పేదలు అనే మానవత్వం కూడా చూపించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచాలకు తప్పకుండా ప్రజలు బుద్ది చెబుతారని కేటీఆర్(KTR) సీరియస్ అయ్యారు. వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ తరఫున న్యాయ సాయం అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.




Advertisement

Next Story