Ponnam: చట్టానికి లోబడే దావత్‌లు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Ponnam: చట్టానికి లోబడే దావత్‌లు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్(Hyd) బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం మాసబ్ ట్యాంక్(మాసాబ్ Tank), డిఎస్ఎస్ భవన్ ఆరవ అంతస్తులోని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్(BC Finance Corporation) కొత్త ఆఫీస్ ను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌజ్ లలో బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నదని, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మందు తాగొద్దా? అని బీఆర్ఎస్ శాసన సభ్యులు అడుగుతున్నారని, రాష్ట్రంలో మద్య నిషేదం లేదు, కానీ చట్టానికి లోబడి, నిబందనల ప్రకారం దావత్‌లు చేసుకోవాలని చెప్పారు. కుటుంబ ఫంక్షన్స్‌లో ఎక్సైజ్ శాఖ(Excise Dept) పర్మిషన్ తీసుకొని, ఫంక్షన్ హాల్లో కూడా మద్యం పెట్టుకుంటున్నారని తెలియజేశారు.

కుటుంబంలో ఇద్దరో.. ముగ్గురో కలిసి దావత్ చేసుకుంటే ఎటువంటి పర్మిషన్ అవసరం లేదని, కానీ వందల మంది కలిసి మందు దావత్ చేసుకున్నప్పుడు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ తప్పనిసరి అని సూచించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే.. కేటీఆర్(KTRBRS) చెప్పినట్లు అక్కడ విదేశీ మద్యం దొరికిందని కేసు నమోదు చేశారని, అనంతరం జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని, అప్పుడే నార్కొటిక్ కేసు నమోదు అయ్యిందని తెలిపారు. తాము వెళ్లి రాజకీయంగా ఎవరిమీద కేసు పెట్టాలని చూడలేదని, సంఘటనలో కేటీఆర్ బంధువులు ఉండటంతో మీడియా అట్రాక్ట్ అయ్యిందని అన్నారు. దానిపై కాంగ్రెస్ నాయకులు స్పందించడం లేదని స్వయంగా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) స్పందించారని, ఆయన విచిత్రంగా కేటీఆర్, తాము కుమ్మక్కు అయినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు తగదని పొన్నం సూచించారు.


Advertisement

Next Story

Most Viewed