Congress Leader: సీఎం రేవంత్‌ను జైల్లోనే చంపాలని చూశారు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
Congress Leader: సీఎం రేవంత్‌ను జైల్లోనే చంపాలని చూశారు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse) ఘటనపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ముఖ్య నేత షబ్బీర్ అలీ(Mohammed Shabbir Ali) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్(KTR) బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌(Raj Pakala Farmhouse)లో దొరికిన లిక్కర్, డ్రగ్స్, అమ్మాయిలు, అబ్బాయిల వివరాలు బయటపెట్టాలని కేటీఆర్‌(KTR)కు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. చట్టం తెలిసిన వ్యక్తులే తప్పులు చేస్తే పోలీసులు కేసులు పెట్టకుండా ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. అసలు డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ ఎందుకు స్పందిస్తున్నారని అడిగారు. జన్వాడ ఫామ్‌హౌజ్‌కు విదేశీ మద్యం ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌ బావమరిది పేకాట ఆడుతూ డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికిపోయాడని షబ్బీర్ అలీ(Shabbir Ali) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి?, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌజ్‌(Janwada Farmhouse)పై వాస్తవాలు చూపించినందుకు గతంలో రేవంత్‌రెడ్డిని 40 రోజులు జైల్లో పెట్టారు. జైల్లోనే రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)ని చంపాలని చూశారని షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతివారం రాజ్ పాకాల రేవ్‌ పార్టీ(Rave party) నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారు. త్వరలో వాస్తవాలను ప్రజలు ముందు పెడతామని షబ్బీర్‌ అలీ కీలక ప్రకటన చేశారు.

Advertisement

Next Story