MLC Balmuri Venkat : కేటీఆర్ కే కుటుంబం ఉందా ? : ఎమ్మెల్సీ బల్మూరి

by Y. Venkata Narasimha Reddy |
MLC Balmuri Venkat : కేటీఆర్ కే కుటుంబం ఉందా ? : ఎమ్మెల్సీ బల్మూరి
X

దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్(KTR) బామ్మర్థి రాజ్ పాకాల(Raj Pakala) చేసుకున్నది ఫ్యామిలీ పార్టీనా లేక దీపావళి పార్టీనా లేక ఇంకేదైననా అన్నది కొన్ని రోజుల్లోనే ఆధారాలతో సహా బయటకు వస్తదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్( MLC Balmuri Venkat) ట్వటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మీ యువరాజు కేటీఆర్ పేరు బయటికి వచ్చింది కాబట్టి రాజకీయాల్లోకి కుటుంబాన్ని లాగుతున్నారని బీఆరెఎస్ నేతలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. ఏం మీ కేటీఆర్ కు మాత్రమే కుటుంబం ఉందా అని ప్రశ్ని్ంచారు. మా నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాడు అర్థరాత్రి వేళ బెడ్రూంలోకి వెళ్లి అన్యాయంగా అరెస్టు చేసినపుడు కుటుంబం, కుటుంబ విలువలు గుర్తుకు రాలేదా అని, అది కక్ష్య సాధింపు, దిగజారుడు రాజకీయం కాదా? అని నిలదీశారు.

ఫోన్ ట్యాపింగ్ లు చేసి భార్య భర్తల ప్రైవేటు విషయాలు విన్న నీతిమాలిన, దిగజారిన బ్రతుకులు మీవని, మీరూ మాట్లాడుతున్నారా కుటుంబాల గురించీ, కక్ష్య సాధింపుల గురించి అని మండిపడ్డారు. రాజ్ పాకాల పార్టీలో ఒక వ్యక్తికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని, తప్పు జరిగింది కాబట్టే పోలీసులు న్యాయబద్ధమైన విచారణ చేస్తున్నారన్నారు. మీ పాలనలో ట్రాప్ చేసి రాజకీయం చేసారు కాబట్టే మేము కరెక్ట్ రూట్ లో ఉన్నప్పటికి మీకు తప్పుగా కనిపిస్తుందని బల్మూరి బీఆర్ఎస్ నాయకులకు చురకలంటించారు.

Advertisement

Next Story