మా గోస పట్టించుకోరా?.. ఏటూరునాగారంలో రైతుల ఆందోళన

by Javid Pasha |
మా గోస పట్టించుకోరా?.. ఏటూరునాగారంలో రైతుల ఆందోళన
X

దిశ, ఏటూరునాగారం: గ‌త గురువారం దిశ ప‌త్రిక‌లో ప్ర‌చురించిన గోదావ‌రిలో దొంగ‌లు ప‌డ్డారు అనే సంచిక‌కు స్పందించిన రెవిన్యూ అధికారులు. కాగా మ‌రునాడు రాత్రి స‌మ‌యంలో గోదావ‌రిలోకి ఏలాంటి వాహ‌నాలు వెళ్ళ‌కుండా రాత్రిరాత్రికే ట్రేంచ్ కొట్టి గోదావ‌రిలోకి రైతులు వెళ్లె మార్గాన్ని మూసివేసారు. ఈమేర‌కు రైతులు త‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని దిశకు త‌మ గోడును వెళ్ళ‌బోసుకున్నారు. గోదావ‌రి ఓడ్డున గ‌ల ఇసుక‌ దిబ్బపై సుమారు 300 ఏక‌రాల మిర్చి ఆర‌బోసుకున్నామ‌ని రెవిన్యూ శాఖ వారు గోదావ‌రి లోకి వెళ్లె మార్గాన్ని మూసివేయడంతో బ‌స్తాలోకి ఎత్తిన మిర్చి ఒడ్డుకు తీసుకురావాలంటే కూలీలు ఒక బ‌స్తాకు 50 రూ.అడుతుగుతున్నారని రైతులు త‌మ అవేద‌న తెలిపారు. కాగా సాయి ద‌త్తా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వారు చేసిన త‌ప్పుకు త‌మ‌కు శిక్ష ప‌డుతుంద‌ని రైతులు మండిప‌డ్డారు. ఇప్ప‌డికైన అధికారులు రైతుల బాధను అర్ధం చేసుకొని ట్రెంచ్ పూడ్చి వేసి త‌మకు న్యాయం చేయాల‌ని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story