ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాంః కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

by Nagam Mallesh |
ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాంః కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
X

దిశ, హనుమకొండ : దేశంలో ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తామని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పాత బస్తీని కైవసం చేసుకోవడమే ఈసారి బీజేపీ లక్ష్యమని.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. హన్మకొండలోని డీ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం సాయంత్రం జరిగిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి బండి సంజయ్ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీజేపీ కార్యకర్తలపై చేసిన అరాచకాలను మర్చిపోలేమని, బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసే వాళ్లమని చెప్పారు. రాక్షస పార్టీ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారమని అన్నారు. కుటుంబ పాలన, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, ఆ రెండు పార్టీలే కలిసి పనిచేస్తున్నాయ న్నారు. కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం ఖాయమని, మాట ముచ్చట కూడా పూర్తయ్యిందని తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లోని పాత బస్తీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.

ఇతర పార్టీల మాదిరిగా ఇన్సూరెన్సులు, ప్రోత్సాహకాలిస్తూ పార్టీ సభ్యత్వం చేసే పార్టీ బీజేపీ కాదు, నిజాయితీగా, పారదర్శకంగా సభ్యత్వం చేసే పార్టీ అందుకే 200 వందల కంటే ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చిన పోలింగ్ బూత్ కమిటీలను సన్మానిస్తని , సభ్యత్వంలో రెండు జిల్లాలు అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చాయి. అందులో కనీసం 70 శాతం మందిని బీజేపీ సభ్యులుగా చేర్చాలి. అంటే కనీసం రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మందికి బీజేపీ సభ్యత్వమివ్వాన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. రామ రాజ్య ఏర్పాటు ఖాయం అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలుస్తామనుకోవడం పొరపాటని.. ప్రతి ఇంటికి వెళ్లండి. బీజేపీ సభ్యత్వం ఇచ్చి స్థానిక ఎన్నికల్లో గెలవాలనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశం అన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మహిళలకు చట్ట సభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. దేశ విభజనవల్ల ఇతర దేశాల్లో నష్టపోయిన హిందువులందరికీ ఉమ్మడి పౌరస్మ్రుతి కల్పించాలనే ఆశయాన్ని నెరవేర్చిన పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువ మోర్చాల వారీగా ఇంటింటికీ వెళ్లి ఆయా వర్గాలకు కేంద్రం చేసిన మేలును వివరించండి అని తెలిపారు. అట్లాగే రైతులకు ఎకరాకు రూ.20 వేల సబ్సిడీని కేంద్రం ఇస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధిని అందిస్తోంది. కనీస మద్దతు ధరను రూ.1310 నుండి రూ.2300లు చేసింది. మహిళలకు సమాన హక్కులు, వేతనాలు కల్పించకుండా దశాబ్దాలపాటు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్. అంబేద్కర్ ను అవమానించి బయటకు పంపిన పార్టీ కాంగ్రెస్. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. మహిళను రాష్ట్రపతిగా, అనేక రాష్టాల్లో మంత్రులుగా, గవర్నర్లుగా నియమించిన పార్టీ బీజేపీ. 7 మంది మహిళలకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించిన పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. అట్లాగే ట్రిపుల్ తలాఖ్ రద్దు, ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చాలని పోరాడుతున్న పార్టీ బీజేపీ.

గ్యారంటీల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే హైడ్రా పేరుతో డ్రామాలాడుతోందని. రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయాలని అడిగితే రుణమాఫీ సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఫాంహౌజ్ కే కేసీఆర్ పరిమితమైండు. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారాన్నారు. బీఆర్ఎస్ రాక్షస పార్టీ. కేసీఆర్ చేసిన అరాచకాలను, బీజేపీ కార్యకర్తలపై చేసిన దాడులను మర్చిపోతామా? ఇదే వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తే అడ్డుకుని దాడులు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఎందుకంటే కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన లాయర్ కు కాంగ్రెస్ రాజ్యసభ సీటిస్తే ఆయనపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed