- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. తండ్రిని కడతేర్చిన కొడుకు
X
దిశ, రాజాపూర్: రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన కావలి నారాయణ అనే వ్యక్తిని అతని కుమారుడు కావలి నందు అనే వ్యక్తి గురువారం రాత్రి అందరూ పడుకున్నాక కుమారుడు గొడ్డలితో హత్య చేసినట్లు సమాచారం. కావలి నందు అనే వ్యక్తికి గత కొంతకాలం నుంచి మతిస్థిమితం లేకుండా ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు.సంఘటన జరిగే కంటే ముందు ప్రతిరోజు కుటుంబ సభ్యులు ఇంట్లో తలుపు గొళ్ళెం పెట్టి పడుకుండేవారని, రాత్రి మాత్రం గొళ్ళెం పెట్టి పడుకోకపోవడంతో ఈ సంఘటన జరిగిందని చర్చించుకుంటున్నారు. గురువారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని అక్కడి నుంచి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Next Story