- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rain Alert: ఐఎండీ అధికారుల కీలక సూచన.. మూడు రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 21న మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా ఈనెల 22న ఉమ్మడి మహబూబాబ్‌నగర్, మెదక్, వికారాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 23న హైదరాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా వర్షం కారణంగా పిడుగులు పడే అవకాశం ఉండటంతో వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే వారు చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. ఇక విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి వస్తువులను తడి చేతులతో తాకరదని అధికారులు కీలక సూచనలు చేశారు.