దిశ కథనానికి స్పందన.. కాపర్ వైర్ దొంగల పై నిఘా..

by Sumithra |
దిశ కథనానికి స్పందన.. కాపర్ వైర్ దొంగల పై నిఘా..
X

దిశ, రాయపర్తి : మండలంలోని కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, బురహానుపల్లి, వాంకుడోత్ తండా గ్రామాలలో గత వారం రోజులుగా రైతుల బోర్ల వద్ద కాపర్ వైర్ దొంగతనాలు జరుగుతున్నాయని దిశ పేపర్లో ఆదివారం వార్త ప్రచురితమైంది. ఈ వార్త పై స్పందించిన ఎస్సై బండారు రాజు మాట్లాడుతూ గత మూడు రోజులుగా గ్రామాలలో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నామని, నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపించినా, రాత్రివేళలో అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాపర్ వైర్ దొంగతనాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని త్వరలోనే నిందితులను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించి ఈ నెంబర్ కు 8712685216 కుసమాచారం అందించాలని తెలిపారు.

Advertisement

Next Story