- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగుతున్న అభివృద్ధి సంక్షేమాలను కొనసాగించుకుందాం : గండ్ర జ్యోతి
దిశ, శాయంపేట : నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గ భారత రాష్ట్రసమితి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గెలిపించుకోవాలని వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్రజ్యోతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం, సూర్యనాయక్ తండా, కాట్రపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్రజ్యోతి మాట్లాడుతూ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని ప్రతిపక్షాలు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యము అన్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతులకు ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైస్ఎంపీపీ లతా లక్ష్మారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ శరత్, మాజీ వైస్ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ భూక్య రమేష్, శాయంపేట ఉపసర్పంచ్ సుమన్, గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్, ఉపాధ్యక్షుడు భాస్కర్, సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్, గిరిజన రాష్ట్ర నాయకులు లింగు నాయక్, ఉపసర్పంచ్ వస్త్రం తదితరులు పాల్గొన్నారు.