- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండల పరిషత్ కార్యాలయంలో కంపే కంపు..
దిశ, డోర్నకల్ : మిషన్ భగీరథ త్రాగునీటి సమస్య పై అత్యవసర సమావేశానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. సమావేశ మందిరం పక్కనే ఉన్న ఆఫీస్ బాత్రూం నుంచి ముక్కుపుటలు అదిరే కంపుతో ఇబ్బంది పడ్డారు. దుర్వాసన అధికమించడానికి సిబ్బంది వాసన గోలీలు, అగర్బత్తీలు పెట్టడం గమనార్హం.
ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా ఓ గ్రామ ప్రథమ పౌరుడు కార్యాలయ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూంల శుభ్రత లేక పోవడం, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తలుపులు, పేరుకుపోయిన వ్యర్ధాలతో దుర్వాసన వెదజల్లడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేటి సమావేశ సమయంలో మరుగుదొడ్డిని ఉపయోగించిన నాయకులు ముక్కులు మూసుకొని వెళ్ళిన దుస్థితి. నలుగురు అటెండర్లు విధులు నిర్వహిస్తున్న కార్యాలయ పరిసరాలు, బాత్రూంలో వ్యర్థపు నీరు నిలిచి శుభ్రత లేక పోవడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.