- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య ప్రయత్నం..కారణం ఇదే..
దిశ, తొర్రూరు: ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన పాషా మోటార్ వైండింగ్ షాప్ ముందు గురువారం ఉదయం 11.30 గంటలకు బుర్రి రమ అనే మహిళ ,పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని తొర్రూరు ఎస్సై ఉపేందర్ తెలిపారు.పెద్ద వంగర మండలం అవుతపురం గ్రామానికి చెందిన బుర్రి రమ,భర్త సతీష్ లకు ఒక పాప(13)ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం భార్యాభర్తల గొడవల వల్ల ఇద్దరు హైదరాబాద్ కు వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో చిన్న గొడవల వల్ల భర్త సతీష్ తాగుడుకు బానిసైన క్రమంలో బుర్రీ రమ అదే గ్రామానికి చెందిన యండి షబ్బీర్ తో కొన్ని రోజులుగా అక్రమ సంబంధం నడుస్తుండగా..కొన్ని రోజుల నుండి షబ్బీర్ రమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని రమ షబ్బీర్ షాపు వద్దకు చేరుకొని ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని...రమ పెట్రోల్ తన మీద పోసుకొని అంటించుకుంది. గమనించిన స్థానికులు పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ కిందకి తీసుకువెళ్ళు మంటలు ఆర్పేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని తొర్రూరు ఎస్సై జి.ఉపేందర్ తెలిపారు.