పని ఉందని మధ్యాహ్నానికి విద్యార్థులు వెళ్లిపోయారు..!

by Kalyani |
పని ఉందని మధ్యాహ్నానికి విద్యార్థులు వెళ్లిపోయారు..!
X

దిశ,డోర్నకల్ : విద్యార్థులు ఎక్కడ అని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రశ్నించగా.. పనుందని విద్యార్థులు వెళ్లిపోయారని సదరు ఉపాధ్యాయ సమాధానం ఇచ్చారు.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పనుందని వెళ్లిపోవడం.. పిల్లల్ని పంపించి సదరు ఉపాధ్యాయులు సెల్ ఫోన్ లో కాలక్షేపం చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు సెల్ ఫోన్ లతో కాలక్షేపం చేస్తూ విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెడుతున్నారు. డోర్నకల్ మండలంలోని పాత దుబ్బతండా, కస్న తండా ప్రాథమిక పాఠశాలలో దాదాపు పది మంది విద్యార్దులు విద్య అభ్యసిస్తున్నారు.

శుక్రవారం అక్కడికి చేరుకున్న దిశకు విద్యార్దలు లేని పాఠశాలలు తారసపడ్డాయి. ఇంతే కాకుండా ఒక పాఠశాలలో టీచర్ సెల్ఫోన్ వీక్షిస్తుండగా విద్యార్దుల లేరా.. అని ప్రశ్నించగా వారు వచ్చి హాజరు వేసిన అనంతరం పని ఉందని వెళ్లిపోయారనే సమాధానం వినిపించింది. విద్యార్థుల విద్యాభ్యాసంపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించవలసిన ఉపాధ్యాయులు స్కూల్ సమయంలో విద్యార్థులను పంపించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్లిన పిల్లలకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంప్లెక్స్ హెచ్ఎం వీరభద్రరావు ను వివరణ కోరగా.. సదరు ఉపాధ్యాయులను వాకబ్ చెయ్యగా పని ఉందని విద్యార్థులు బయటికి వెళ్లినట్లు తెలిపారు.ఉపాధ్యాయులు మాత్రం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి నిరుపేదలకు విద్యను అందించాలని ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ పలువురు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం తో క్షేత్రస్థాయిలో నీరుగారిపోతుంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే గ్రామీణ ప్రాంతాల్లో పలువురు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

మండల విద్యాశాఖ అధికారి వివరణ కోరగా.. సదరు ఉపాధ్యాయులను తెలుసుకుని పాత దుబ్బ తండా ఉపాధ్యాయురాలు చరవాణిలో ఎంఆర్సి,కాంప్లెక్స్ మెసేజ్ లు చూస్తున్నారు. విద్యార్థులు ఇంటర్వెల్ లో బాత్రూం కి వెళ్లారు. పిల్లలు వచ్చిన తర్వాత ఫోటో తీసి కాంప్లెక్స్ హెచ్ఎం కు పంపించానని చెప్పారు.కస్న తండా పాఠశాలలో హాజరైన ఇద్దరు విద్యార్థులు పేరెంట్ రావడంతో వెళ్లిపోయారని అక్కడి ఉపాధ్యాయుడు తెలిపాడని ఆయన తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed