జాతీయ జెండాకు అవమానం

by Mahesh |
జాతీయ జెండాకు అవమానం
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు.జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకు రాకపోవటంతో బలంగా లాగారు. దీంతో జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవిష్కరణ జరిగింది.కాగా వెంటనే తాడు వదిలేయటంతో జాతీయ జెండా పై నుంచి జారి నేరుగా స్పెషల్ ఆఫీసర్ కాళ్లపై పడగ వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది లాగి పైకి ఎగురవేశారు.

Advertisement

Next Story