- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్డ్ ఎంపీడీఓ హత్యకు పాల్పడిన సుపారీ గ్యాంగ్ అరెస్ట్..
దిశ, హన్మకొండ : గత మూడు రోజుల క్రితం జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ హత్య చేసిన సుపారీ గ్యాంగుకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను బచ్చన్నపేట, వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుండి పోలీసులు ఒక కారు, మూడు సెల్ఫోన్లు, పదిహేనువేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. హత్యలో ప్రధాన నిందితుడైన గురబోయిన అంజయ్యకు చెందిన భూములకు సంబంధించి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా సర్వే.నం 174 భూములకు సంబంధించి మృతుడు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసి మృతుడు నల్లా రామకృష్ణ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే అక్కసుతో మృతుడు రామకృష్ణయ్యను హత్య చేసేందుకు అంజయ్య సిద్ధపడ్డాడు. ఇందుకోసం అంజయ్య, తిరుపతిలకు గతంలో పరిచయం వుండడంతో రామకృష్ణయ్య అంతమొందిస్తే 8 లక్షలు రూపాయలు ఇస్తానని ప్రధాన నిందితుడు అంజయ్య మరో నిందితుడు తిరుపతితో ఒప్పందం చేసుకోవడంతో పాటు, అందుకు అంగీకరించిన తిరుపతి అంజయ్య నుండి 50వేల రూపాయలు అడ్వాస్సు తీసుకున్నాడు. రామకృష్ణయ్య హత్య చేసేందుకు నిందితుడు తిరుపతి మరో ముగ్గురు నిందితులు తన దగ్గరి బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, ఆలియాస్ భాస్కర్, దండుగుల రాజు సహాకారాన్ని తీసుకున్నాడు.
ఈ హత్యలో భాగంగా ఈ నలుగురు నిందితులు ఈ నెల 15వ తేదిన ఒక కారును తీసుకోని సాయంత్రం 5.30 నిమిషాలకు పోచన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బచ్చన్నపేట నుండి పోచన్నపేటకు వెళ్ళుతున్న మృతుడు రామకృష్ణయ్యను నిందితులు నలుగురు బలవంతంగా కారులోకి ఎక్కించుకొనిపోయి. సుమారు అదేరోజు సాయంత్రం. 6.30 నిమిషాలకు చిన్నరామన్చర్ల గ్రామ శివారు ప్రాంతంలో నిందితులు మృతుడు రామకృష్ణయ్య కారు నుండి దింపి టవల్తో మృతుడి మెడను బిగించి ఊపిరి అడకుండా చేసి రామకృష్ణయ్యను దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు రామకృష్ణయ్య మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఓబూల్ కేశవాపూర్, పెద్దపహాడ్ మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో పడవేసి నిందితులు అక్కడి నుండి బచ్చన్నపేటకు చేరుకోని రామకృష్ణయ్య హత్య చేసినట్లుగా ప్రధాన నిందితుడు అంజయ్యకు సమాచారం అందించి కారును అంజయ్య ఇంటి ముందు వుంచి నిందితులు వెళ్ళిపోయారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు.
ఇందులో ప్రధాన నిందితుడు అంజయ్య పోలీసులు అరెస్టు చేయగా అంజయ్య ఇచ్చిన సమాచారం మేరకు మిగితా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ ఎసీపీ జితేందర్ రెడ్డి, నర్మెట్ట సర్కిల్ ఇన్స్స్పెక్టర్ నాగబాబు, బచ్చన్నపేట ఎస్సై నవీన్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్సై దేవేందర్, శరతో పాటు టాస్క్ఫోర్స్ ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.