పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు వాళ్లు గుండెకాయ: SP కోటిరెడ్డి

by Disha News Web Desk |
పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు వాళ్లు గుండెకాయ: SP కోటిరెడ్డి
X

దిశ, వికారాబాద్: పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు డీపీఓ స్టాఫ్ అధికారులు గుండెకాయ లాంటి వారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అన్నారు. మంగ ళవారం ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న డీపీఓ స్టాఫ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీపీఓ స్టాఫ్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్‌కు గుండె కాయ లాంటివారని, అందరూ పోలీస్ అధికారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు. అధికారులు సిబ్బందితో ఫ్రెండ్లీగా నడుచుకొని, సోదర భావంతో పని చేయాలని అన్నారు. అప్పుడే ఎలాంటి కష్టమైన పని ఉన్న సులువుగా పూర్తి చేయవచ్చని గుర్తుచేశారు. ప్రతినెల డీపీఓలో పనిచేసే అధికారులందరితో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఉంటుందని, వచ్చే మీటింగ్ నాటికి అందరి పనితనంలో మెరుగవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రశీద్, ఏ‌ఆర్ డీ‌ఎస్పీ సత్యనారాయణ, ఏ‌ఓ అమర్నాథ్, డీఎస్బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story