సర్వాయి పాపన్న అందరికీ ఆదర్శప్రాయుడు

by S Gopi |
సర్వాయి పాపన్న అందరికీ ఆదర్శప్రాయుడు
X

దిశ, డోర్నకల్: సర్వాయి పాపన్న గౌడ కులస్తులకే పరిమితం కారని, బహుజనుల ప్రయోజనం కోసం పోరాటం చేశారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. వి రమణ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని వెన్నారం గ్రామ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్నతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నీర కేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోష్కరమన్నారు. కల్లుగీత కార్మికులకు రూ.5,000 పెన్షన్, ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి గోపయ్య జ్ఞాపకార్థం కుమారులు వెంకన్న, నాగేశ్వరావులను అభినందించారు. ఈ స్ఫూర్తిగా అన్ని గ్రామాల్లో సర్వాయి పాపన్న విగ్రహాలు నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకన్న, అఖిల భారత గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్, కేజీకేఎస్ జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, జడ్పీటీసీ కమల రామనాథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story