- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. రోడ్డు పనులు ప్రారంభించిన ‘సాయి దత్త’
దిశ, మంగపేట : ఈ నెల 2న దిశ జిల్లా టాబ్లాయిడ్ లో వచ్చిన ‘ నరకప్రాయం ఆ రహదారి ’ వార్తకు పనులు పొందిన సాయి దత్త కన్స్ స్ట్రక్షన్, ఆర్ అండ్ బీ అధికారులు స్పందించారు. 2 సంవత్సరాల క్రితం ఆగిపోయిన మంగపేట -ఏటూరునాగారం డబుల్ లేన్ 17 కిలోమీటర్ల రెనివల్ కోర్స్ పెండింగ్ పనులు ఆదివారం మండలంలోని కమలాపురం మంగపేట మద్యలోని దొంగలవోర్రె నుండి ప్రారంభించారు.
దిశలో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్, డీఈ రఘువీర్ లు గుత్తేదారుతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న రెవినల్ కోర్స్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 17 కిలోమీట్ల రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో ప్రజల బాధలను వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించి పెండింగ్ రోడ్డు పనులు చేపడుతుండడంతో మంగపేట, ఏటూరు నాగారం మండలాల ప్రజలు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.