- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్విమ్మింగ్‌లో మూడు పథకాలు సాధించిన కన్నె రాజు
దిశ, ఖానాపూర్: మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు స్విమ్మింగ్‌లో మూడు పథకాలు సాధించాడు. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే స్విమ్మర్ రాజుగా పేరు గాంచిన ఇతడు హనుమకొండ జేన్ఎస్ గ్రౌండ్‌లో మార్చి 4 ,5 , 6 తేదీలలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ - 2022 లో పాల్గొన్నారు. హనుమకొండ హెడ్ క్వార్టర్స్ లో సిటీ ఆర్మ్డ్ ఫోర్స్‌లో పనిచేస్తున్న రాజు స్విమ్మింగ్ విభాగంలో 50 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్‌లో గోల్డ్ మెడల్ , 50 మీటర్స్ బటర్ ఫ్లైలో గోల్డ్ మెడల్ అలాగే 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ లో సిల్వర్ మెడల్ మొత్తం మూడు పతకాలు సాధించడం విశేషం. ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి మెడల్స్ ప్రధానం చేశారు. స్విమ్మింగ్ విభాగంలో విశేష ప్రతిభను చూపిన కన్నె రాజును సీపీతో పాటు ఉన్నతాధికారులు,క్రీడాకారులు అభినందించారు.