Parakala MLA : ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు

by Aamani |
Parakala MLA : ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు
X

దిశ, పరకాల : పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్,పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలలో కార్యకర్తలు తప్ప అసలైన రైతులు ఎవరు కనపడటం లేదని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్,పార్టీకి లేదని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీని అమలు చేసి తీరామని, రుణమాఫీ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.

సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సరిచేసి, వారికి రావలసిన రుణాలను మాఫీ చేయించుటకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందజేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.త్వరలోనే అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, పరకాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, స్వర్ణలత, పాడి కల్పన, సోదా రామకృష్ణ,కౌన్సిలర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story