- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొరకని పులి జాడ…ఇంకా రెండు రోజులు గాలింపు చర్యలు
దిశ,పలిమెల : పులి అంటే భయపడని వారు ఉండరు. ఎప్పుడు, ఎక్కడి నుంచి పెద్దపులి వచ్చి దాడి చేస్తుందో అనే భయాందోళనలో గడపాల్సిన పరిస్థితులు గ్రామ ప్రజల్లో నెలకొంది. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాలన్నా జనాలు వణికిపోతున్నారు. తాజాగా పలిమెల మండలం లో ముకునూరు,కామన్ పల్లి గ్రామాల మధ్యలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక పులి సమాచారం పట్టుకునేందుకు అటవీ అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అధికారులకు పులి సంబంధించిన చిన్న ఆనవాళ్లు కూడా ఈ రోజు లభించలేదు. ఇంకా రెండు రోజులపాటు పులి సంచారం కోసం గాలింపు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు సిసిఎఫ్, ప్రభాకర్,డిఎఫ్ఓ,నవీన్ రెడ్డి,ఆదేశాలు జారీచేశారు.గొర్రెల కాపర్లు, ప్రజలు భయాందోళనకు గురికాకూడదని.అలాగే పులి సమాచారం తెలిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలుపగలరని సూచించారు. పులి సంచారం నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన పడకుండా ఉండాలని సూచించారు. అలాగే పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలాని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ రమేష్, ఏటూరునాగారం, ఎఫ్ ఆర్ఓ రవీందర్, మహాదేవపూర్,ఎఫ్ఆర్ఓ, నాగరాజు,పలిమెల, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.