ధ్యానం, యోగాను ప్రజలు అలవరచుకోవాలి : ఎమ్మెల్యే

by Sumithra |
ధ్యానం, యోగాను ప్రజలు అలవరచుకోవాలి : ఎమ్మెల్యే
X

దిశ, కాటారం, (భూపాలపల్లి) : శ్వాసమీద ధ్యాస పెడుతూ ధ్యానం.. శారీరకంగా యోగాను ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో అలవర్చుకుంటే వివిధ రకాల రోగాలు రాకుండా దూరమవడంతో పాటు ఆరోగ్యవంతులుగా తయారవుతారని భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా శాఖాహార ర్యాలీ అహింస విజయ వేడుక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాంసాహారం వద్దు.. శాకాహారం ముద్దు అంటూ భూపాలపల్లిలోని సర్వాత్మ పిరమిడ్ కేంద్రం నుండి జయశంకర్ విగ్రహం, అంబేద్కర్ చౌరస్తా నుండి పాతబస్టాప్ మీదుగా సింగరేణి ఫంక్షన్ హాల్ వరకు పెద్దఎత్తున శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ధ్యానం చేసేందుకు గ్రామాల్లో ప్రజలకు విస్తృత అవగాహన చేయాలని పిరమిడ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని అన్నారు.

నేటితరంలో యువకులు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని వారిని సన్మార్గంలో నడిపించేందుకు పిలిచారు. ఆర్గనైజేషన్ ద్వారా అందర్నీ సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు ధ్యానం చేయించేలా ఆర్గనైజేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. 24 ఏళ్లుగా మాంసాహారం బంద్ చేసి శాఖాహారిగా మారినట్లు మాంసాహారం తినడంలో ఏమి పోషక విలువలు లేవని వివిధ సమస్యలతో వైద్యం కోసం డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నామని ధ్యానం యోగ ద్వారా ఆరోగ్యం బాగుంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఎవరు ఎన్ని మార్గాలు అనుసరించిన శ్వాసమీద ధ్యాస తోటే ఆరోగ్యం సిద్ధిస్తుందని దేశంలో శాంతి స్థాపన కోసం ప్రతి ఒక్కరు సన్మార్గం వైపు నడవాలని పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మాస్టర్ ట్రైనర్స్ కిషన్ రెడ్డి, రహీం, రామకృష్ణ, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు భూపతి రెడ్డి, భూపాలపల్లి కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు గుడాల అరుణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ధ్యాన, యోగ అభ్యాసకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed