- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్, సైబర్ నేరాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు ప్రమాదకరమైన గంజాయికి బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య, అత్యాచారం కంటే ప్రస్తుతం సైబర్ నేరాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. పేదలు, మధ్యతరగతి వారు సైబర్ నేరాలతో చిక్కుకు పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ నిర్మూలన కోసం చిరంజీవి ఒక్కరే స్పందించి వీడియో విడుదల చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నియంత్రణ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చిరంజీవి వీడియో ద్వారా ప్రచారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణకు తనంతట తానే ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. మిగతా నటీనటులు కూడా ముందుకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో సమాజం కోసం ఉపయోగపడే వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలని సీఎం కోరారు. థియేటర్ల యజమానులు కూడా డ్రగ్స్‌పై అవగాహన డాక్యుమెంటరీ వీడియోలను ప్లే చేయాలని చెప్పారు.