పల్లీలు ఎక్కువగా తినేవారు వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!

by Prasanna |
పల్లీలు ఎక్కువగా తినేవారు వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: వేరుశెనగలు అత్యధిక ప్రోటీన్ విత్తనాలలో ఒకటిగా చెబుతుంటారు. మనలో చాలా మంది వీటిని ఉడకబెట్టుకుని తింటారు. మరి కొందరు పచ్చిగానే తినేస్తారు. ఇవి మాంసంతో సమానమని పలు రకాల పరిశోధనలు చేసి నిపుణులు వెల్లడించారు.ఇవి మార్కెట్‌లో చాలా సరసమైన ధరకు లభిస్తాయి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌ లో ఉండే పోషకాలు వీటిలో కూడా ఉంటాయి. అయితే, కొందరు మాత్రం పల్లీలు పేరు వినగానే దూరం పెట్టేస్తారు. అయితే, దీని వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

వేరుశెనగలో ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా సెలీనియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, థయామిన్, జింక్, కాపర్, మాంగనీస్ పోషకాలు లభిస్తాయి. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె సమస్యలు రాకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

బలంగా ఉండాలంటే బాదం, జీడిపప్పుతో పాటు వేరుశెనగ కూడా తీసుకుంటే శరీరానికి తగినంత బలం వస్తుంది. మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల పెద్దపేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల రోజుకు ఒక్కసారైనా పల్లీలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed