- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మొత్తం మీడియా వాళ్లే చేశారు’.. CM రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం మోడీతో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నూతన ఎన్నిక గురించి జర్నలిస్టులు రేవంత్‌ను ప్రశ్నించగా.. ‘‘మంత్రి వర్గాన్ని మీరు విస్తరించారు. మీరే వాయిదా వేశారు’’ అని మీడియాను ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు. ఫలాతా తేదీన కేబినెట్ విస్తరణ అని తాను ఏమి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిని నియామకం, మంత్రివర్గ విస్తరణ జరగాలని టీపీసీసీ చీఫ్‌గా ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.
ఈ అంశం ప్రస్తుతం హై కమాండ్ పరిశీలనలో ఉందని, కానీ అంతకంటే ముందే మీరే కేబినెట్ విస్తరించారు. మీరే శాఖలు పంచారు. ఇప్పుడు మీరే విస్తరణ వాయిదా వేశారని చమత్కరించారు. ఈ నెల 7వ తేదీ లోపు టీపీసీసీ చీఫ్‌గా తన పదవి కాలం ముగుస్తుందని ఆ లోగా కొత్త అధ్యక్షుడిని నియామించాలని అధిష్టానాన్ని కోరానని పేర్కొన్నారు. పీసీసీ ఎన్నికకు సంబంధించిన బాల్ ఇప్పుడు ఏఐసీసీ చీఫ్ కోర్టులో ఉందని.. దీనికి సరైన సమాధానం మీకు అక్కడే దొరుకుందని జర్నలిస్టులకు సూచించారు. కాగా, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషంలో కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.