- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Donald Trump: వాళ్లందరినీ అమెరికా నుంచి తరిమేస్తాం.. తొలి ప్రసంగంలో ట్రంప్ షాకింగ్ డెసిషన్

దిశ, వెబ్‌డెస్క్: అకమ్ర వలసదారులను అమెరికా నుంచి తరిమివేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. విదేశీ ఉగ్రవాద(Foreign Terrorism) చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆటోమొబైల్ రంగాన్ని ఊహించనంత ఎత్తుకు తీసుకెళతాం అని అన్నారు. ప్రజలకు కావాల్సిన వాహనం కొనుక్కునే స్వేచ్ఛనిస్తామని చెప్పారు. మిడిలీస్ట్‌లో బంధీలు ఇళ్లకు తిరిగి రావడం సంతోషకరం అని అన్నారు. ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా(Gulf of America)గా మారుస్తామని మరో సంచలన ప్రకటన చేశారు. పనామా కెనాల్‌ను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు.
2025 అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని అన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తాం.. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇక నుంచి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహా ఘట్టానికి హాజరైన అతిథులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇవాళ్టి నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుంది. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కూడా కావాలని అభిప్రాయపడ్డారు.