ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా షూటింగ్ ఎప్పట్నించి స్టార్ట్ అంటే..?

by Kavitha |
ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా షూటింగ్ ఎప్పట్నించి స్టార్ట్ అంటే..?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి సినిమా భారీ హిట్‌తో దూసుకుపోతోంది. ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కల్కి వచ్చి హిట్ అవ్వడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ప్రభాస్ చేతిలో సలార్ 2, రాజా సాబ్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయనే విషయం తెలిసిందే.

అయితే ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్ వస్తున్న సలార్ 2 మూవీ.. ఎన్టీఆర్‌తో చేస్తున్న దేవర సినిమా అయ్యాకే ఈ చిత్రం షూట్ మొదలవుతుంది. స్పిరిట్, కల్కి 2 అయితే వచ్చే సంవత్సరమే. రాజా సాబ్ షూట్ ప్రసెంట్ నడుస్తుంది. ఇక హను రాఘవపూడి సినిమా త్వరలో మొదలు పెట్టబోతున్నారంటూ ఓ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హను రాఘవపూడి – ప్రభాస్ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్స్ జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇక హను రాఘవపూడి – ప్రభాస్ సినిమా యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో లవ్ స్టోరీ కథ అని, ఆల్రెడీ మూడు సాంగ్స్ వర్క్ కూడా పూర్తయిందని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి డేట్స్ ఇవ్వనున్నాడు. ఆగస్టు వరకు రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమాకి డేట్స్ ఇస్తాడు అని తెలుస్తుంది. దీంతో సెప్టెంబర్‌లో హను రాఘవపూడి – ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

Next Story

Most Viewed