ఈనెలలోనే నీట్ పీజీ పరీక్ష.. రెండు గంటల ముందు పేపర్ తయారీ

by Shamantha N |
ఈనెలలోనే నీట్ పీజీ పరీక్ష.. రెండు గంటల ముందు పేపర్ తయారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ పరీక్ష ఈ నెలలోనే జరగనుంది. హోంమంత్రిత్వశాఖ, యాంటీసైబర్ క్రైం అధికారుల సమావేశం మంగళవారం జరిగింది. కాగా, నీట్ పీజీ పరీక్ష ఈనెలలోనే జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేస్తారని పేర్కొన్నారు. జూన్ 23న నీట్ పీజీ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ నీట్ యూజీ, నెట్ వివాదల మధ్య పరీక్షకు కొన్ని గంటల ముందు నీట్ పరీక్షను వాయిదా వేశారు. పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరీక్ష రాసేందుకు వందల కిలోమీటర్ల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇకపోతే, నీట్ నిర్వహించే ఎన్టీఏ చీఫ్ పై కేంద్రం చర్యలు తీసుకుంది. ఆయనపై వేటు వేసింది. ఇకపోతే, పేపర్ లీకేజీలో సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.

Next Story

Most Viewed