- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA:పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ
దిశ,బయ్యారం : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉందని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య (MLA Koram Kanakaiah) అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ బాధితులకు తహసీల్దార్ బి.విజయ అధ్యక్షతన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మండలంలో 19 మందికి ఒక్కొక్కరికి లక్షా నూట పదహారు రూపాయల చెక్కును అందించారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరి కలలు సాకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం కొత్తపేట పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే చేతులు మీదుగా బయ్యారం రైతుల సహకార సంఘంను, ఎరువుల విక్రయ సబ్ సెంటర్ కేంద్రంను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో కోదండరాం ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. నాయకులు పాత ,కొత్త లేకుండా సమన్వయం చేసుకొని అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, మండలంలో వర్గ వైషమ్యాలకు తావు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ,ఇల్లందు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బిజ్జ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ దైవాదీనం, భూక్యాప్రవీణ్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మి, నిర్మల, వేల్పుల శ్రీను, వెంకటపతి, పగడాల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సోమేష్, రాంమూర్తి, భాస్కర్, నర్సయ్య, గుంజ వీరస్వామి పాల్గొన్నారు.