రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి అదృశ్యం... నాలుగు రోజులు అయినా దొరకని ఆచూకీ..

by Sumithra |
రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి అదృశ్యం... నాలుగు రోజులు అయినా దొరకని ఆచూకీ..
X

దిశ, గూడూరు : రైల్లో ప్రయాణిస్తున్న ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన కలకత్తా నుండి విజయవాడ వెళ్లే రైల్లో జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాములు తండా గ్రామానికి చెందిన నునవత్ వినయ్ కుమార్ కలకత్తాలోనీ ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత 4 రోజుల కిందట 21వ తేదీ బుధవారం రోజురాత్రి ఇంటికి వస్తున్నాను అని చెప్పి తల్లితండ్రులకు సమాచారం అందించాడు. కలకత్తా నుండి విజయవాడ వరకు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైల్లో వస్తున్నానని తెలిపాడు.

రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో కూడ తండ్రీ కి ఫోన్ చేసి మాట్లాడుతుండగా రైలు కటక్ జంక్షన్ దాటగానే వినయ్ ఫోన్ కాల్ కట్ అయిందని వారి తండ్రి అన్నారు. తరువాత వెంటనే తిరిగి మళ్లీ ఫోన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకొని వారు ఆ రైల్లో వెతకగా B1 బోగిలో అతని సీట్ వద్ద బ్యాగ్ మాత్రం లభించిందని అతని ఆచూకీ మాత్రం దొరకలేదు అని వారి తల్లి తండ్రులు వాపోతున్నారు. వినయ్ కు 5 నెలల క్రితమే వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు 4 రోజులుగా వెతుకుతున్నా ఇంత వరకూ అతని జాడ లభించలేదు. అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అతడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed