- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధర్మారెడ్డిని లక్ష్య మెజారిటీతో గెలిపించాలి : మంత్రి సత్యవతి రాధోడ్..
దిశ, హనుమకొండ టౌన్ : ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడుతున్నాయని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలం చింతలపల్లి, పల్లారుగూడ, మొండ్రాయి, ముమ్మడివరం గ్రామాలలో స్త్రీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ లతో కలిసి పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ మహిళలకు తోబుట్టులాగా అండగా నిలుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
పరకాల నియోజకవర్గంకు గిరిజన భవనంను త్వరలో ఏర్పాటు చేస్తాం దానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తాం అని అన్నారు. నియోజకవర్గంలోని తండాలను 20 కోట్ల నిధులు మంజూరు చేస్తామని, దేశంలో ఎక్కడ లేని విధంగా రూ.2000 పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని, దేశాన్ని పాలిస్తున్న నేతల రాష్ట్రంలో కూడా రూ.700 పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. రైతును రాజుగా చూడాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. దేశంలో రైతుల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ధర్మారెడ్డి ఏమి అడిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని అన్నారు.
పరకాల నియోజకవర్గానికి ధర్మారెడ్డి దొరకడం ఒక వరం, మనసు పెట్టి ప్రజల కోసం పని చేస్తున్న నాయకుడు ధర్మారెడ్డి, ధర్మారెడ్డిని కాపాడుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరకాల నియోజకవర్గం మీద అమితమైన ప్రేమ ఉంది అని, అభివృద్ధి పనులు ప్రజల సహకారంతో నియోజకవర్గంను ముందంజలో ఉంచామని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసామని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు గ్రహించాలాని కోరారు. తండాలను గ్రామ పంచాయతీగా చేసుకొని అభివృద్ధి చేస్తుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. సత్యవతి రాధోడ్ ని నియోజకవర్గంకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నియోజకవర్గంను ఎంతో అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మన ప్రధాన లక్ష్యం నీళ్లు, నిధుల, నియామకాలు వాటిని సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధి పథంలో ముందంజలో ఉంది అని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వుండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ప్రతి గ్రామానికి నిధులు కేటాయించారు. పరకాల నియోజకవర్గంలోని గ్రామంలో రోడ్లు పూర్తి చేసుకొని ఇప్పుడు వ్యవసాయ భూముల దగ్గరకు రోడ్లు వేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆర్ధికంగా ఎదగారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.