త్వరలో గిరిజన బంధు : మంత్రి హరీష్ రావు

by Sumithra |
త్వరలో గిరిజన బంధు : మంత్రి హరీష్ రావు
X

దిశ, పాలకుర్తి : రాబోయే రోజుల్లో గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామని ఆపదలో ఆదుకున్న, తలలో నాలుకలా ఉండే దయాకర్ రావు గెలవాలా ? ఓట్ల ముందట నోట్ల కట్టలు పట్టుకొచ్చిన అమెరికా ఎన్నారైలు గెలవాలా ? పాలకుర్తి ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతుగా పాలకుర్తి రోడ్ షో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో దయన్న పోరాడిండు. నాతో కొట్లాడి స్పెషల్ కోటాలో మందులు తెచ్చుకుని ప్రజలను కాపాడుకున్నాడు ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిన మీ అభిమాన నాయకుడు దయాకర్ రావు అని అన్నారు. ఆపోజిట్ అభ్యర్ధి అమెరికాలో విల్లాలు గిఫ్ట్‌గా ఇచ్చి టిక్కెట్లు కొన్నరని కాంగ్రెసోళ్లే అంటున్నారని దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ స్ఫూర్తి నిండిన పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని డబ్బులున్నాయని కాంగ్రెసోళ్లకు అహంకారం.

దాంతో లీడర్లను కొంటారు కానీ ప్రజలను కొనలేరని తేల్చిచెప్పారు. దయన్న గెలుపును నోట్లకట్టలు అడ్డుకోలేవని కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి ఉన్నగోసి ఊడపీకిర్రు నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం కరెంట్ కావాలా ? కాంగ్రెస్ కావాల్నా? కరెంట్ కావాలంటే దయన్నకు ఓటు గుద్దాలని అన్నారు. కాంగ్రెసోళ్లు ప్రతీ రైతుకు 15వేలు అంటున్నారు. కేసీఆర్ మాత్రం ఎకరాకు 16 వేలు ఇస్తడు. 12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ గెలవాల్నా? 12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ గెలవాల్నా ఓడినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు, గెలిచినోడు నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఇలాంటి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రిస్క్ తీసుకుందామా గతంలో తండాలకు కరెంటు లేదు, నీళ్లు రావు, రోడ్డు లేకుండే. కానీ దయాకరన్న గెలిచిన తర్వాత డాంబర్ రోడ్డు, ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్ వచ్చింది. ముఖ్యంగా తండాలు గ్రామపంచాయితీలు అయినాయి. తండాలు గ్రామపంచాయితీలు చేస్తమని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది.

ఎల్ హెచ్ పీఎస్ వాళ్లు ఏళ్ల తరబడి కొట్లాడిండ్రు. కానీ కేసీఆర్ దాన్ని నిజం చేసిండు. లంబాడీల కలను నెరవేర్చిండు. పాలకుర్తి పవర్ ఫుల్ గా ఉండాలంటే దయన్నని గెలిపించాలని అన్నారు. నిన్న ప్రియాంక గాంధీ వచ్చింది. ఆమె సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 403 నియోజకవర్గాలు ఉంటే కేవలం 2 మాత్రమే గెలిచింది కాంగ్రెస్ అన్నారు. అక్కడ ఎన్నికల ఇంచార్జ్ ప్రియాంక గాంధీనే. ఈమెను సొంత ప్రజలే ఓడించిండ్రు. అలాంటి మనిషి ఇక్కడికొచ్చి చెప్తే ఓటేస్తామా ? కాంగ్రెస్ వస్తే కరువు వస్తది అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు పోతదన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అయితదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటే కేసీఆర్ కి హైకమాండ్ ప్రజలే. మన ఇంటి పార్టీ, మన కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed